తెలుగు రాష్ట్రాల్లో తన పవర్ చూపించిన సూపర్ స్టార్ !!


సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే తమిళనాడుతో పాటు యావత్ దేశం మొత్తం ప్రభంజనమే. అంతటి పెద్ద అభిమానగణం రజినీకాంత్ సొంతం. భారత సినిమా చరిత్రలోనే రజినీ నటిస్తున్న 2.0 చిత్రం టెక్నికల్ వండర్ గా తెరకెక్కుతోంది. సంచలన దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఘనవిజయం సాధించిన రోబో చిత్రానికి ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ హీరోయిన్.

ఇన్ని విశేషాలు ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్ర బిజినెస్ ఇప్పటికే ప్రారంభమైంది. భారీ ధరకు 2.0 హక్కులను సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ లు ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్ర పంపిణీ హక్కులను గ్లోబల్ సినిమాస్ దక్కించుకుంది. ఎంత మొత్తానికి పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది అనే విషయాన్ని ఆ సంస్థ ప్రకటించకపోయినా రజిని చిత్రాల్లో రికార్డ్ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం.