రజినీ సినిమాపై వస్తున్న రూమర్లను కొట్టిపారేసిన దర్శకుడు !
Published on Apr 20, 2017 5:48 pm IST


ప్రస్తుతం ‘రోబో 2’ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ అది పూర్తవగానే పా. రంజిత్ దర్శకత్వంలో మరొక చిత్రం చేయనున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘కబాలి’ చిత్రం భారీ స్థాయి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో రజనీ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించగా ఈసారి చేయబోయే సినిమాలో ఆయన డాన్ గా కనిపిస్తారని, ఆ డాన్ పాత్ర ఒకప్పటి ముంబై డాన్ హాజీ మస్తాన్ ను ఆధారంగా చేసుకుని రూపొందించబడినదని రకరాకల్ వార్తలు పుట్టుకొచ్చాయి.

ఒకానొక దశలో ప్రేక్షకులు ఆ వార్తను నిజమనే అనుకున్నారు. కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు పా. రంజిత్ అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని, రజనీకాంత్ అలాంటి పాత్రేమీ చేయడంలేదని అన్నారు. దీంతో రజనీ అభిమానుల్లో మరోసారి రజనీ పాత్ర ఎలా ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది. ఇకపోతే మే 1వ తారీఖున సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందులో రజనీ పాత్రేమిటి, సినిమా ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులెవరు, టైటిల్ అప్పుడు వంటి ముఖ్య వివరాలు తెలిసే అవకాశముంది.

 
Like us on Facebook