నాగార్జున సినిమా టైటిల్ లోగో విడుదల !


కొత్త తరహా సినిమాల్ని ట్రై చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం హర్రర్ థ్రిల్లర్ జానర్లో చేస్తున్న చిత్రం ‘రాజుగారి గది -2’. ఓంకార్ డైరెక్షన్లో రూపొంది 2015 అక్టోబర్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకున్న ‘రాజుగారి గాడి’ అనే సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగార్జున ఒక మానసిక వైద్యుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోను ఈరోజు సాయంత్రం 7 గంటలకు విడుదలచేయనున్నారు.

దాంతో పాటు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే అక్టోబర్ 13న చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ ఎత్తున ఉండనున్నాయి. ఇకపోతే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా శీరత్ కపూర్ నటిస్తుండగా అశ్విన్, వెన్నెల కిశోర్ లు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.