గత ఏడాదిలో తెలుగు సినిమా వద్ద వచ్చిన పలు చిన్న చిత్రాలు సెన్సేషనల్ విజయాన్ని సాధించాయి. అలా పలు నిజ సంఘటనలు ఆధారంగా తెరకెక్కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రమే ‘రాజు వెడ్స్ రాంబాయి’. యువ హీరో హీరోయిన్స్ అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు కలయికలో కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ మంచి హిట్ అయ్యింది. ఇక ఇదే కాంబినేషన్ ఇపుడు మళ్ళీ రిపీట్ కానుంది అని తెలుస్తుంది.
దర్శకుడు సాయిలు మళ్ళీ యువ హీరో అఖిల్ రాజ్ తో కొత్త ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. ఈ చిత్రం కూడా మంచి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని టాక్. సో ఈసారి వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. మరి హీరోయిన్ కూడా రిపీట్ అవుతుందా లేదా అనేవి కాలమే నిర్ణయించాలి. ఇది వరకే ఈ దర్శకుడు తాను భవిష్యత్తులో కూడా ఈ తరహా నేల కథలే చేస్తానని అప్పుడే చెప్పిన సంగతి తెలిసిందే.
