టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ‘ఓదెల 2’ కూడా ఒకటి. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించడంతో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక గతంలో వచ్చిన ‘ఓదెల’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే, దీపావళి కానుకగా ఈ సినిమా నుండి ఓ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. పండుగపూట ఈ సినిమా నుండి రాక్షస్‌ని పరిచయం చేస్తు్న్నామని.. మిమ్మల్ని ఖచ్చితంగా భయభ్రాంతులకు గురిచేస్తుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ఈ ట్రీట్‌ను అక్టోబర్ 31న ఉదయం 9.09 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా నుండి ఎలాంటి అప్డే్ట్ రానుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నాగసాధుగా శివశక్తి అనే పాత్రలో నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, మురళీ శర్మ, వశిష్ట సింహా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. డి.మధుతో కలిసి సంపత్ నంది ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.