రకుల్ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసిందా?

rakul
తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో రకుల్ ప్రీత్ సింగ్ ముందుండి దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్‌తో ఓ సినిమా, రామ్ చరణ్‌తో ధృవ అనే సినిమా, సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఖాళీ అనేదే లేకుండా కష్టపడుతున్నారు. ఈమధ్యే తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న తుప్పరివాలన్ అనే సినిమాకు కూడా రకుల్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో విశాల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారట.

దీంతో రకుల్ ‘తుప్పరివాలన్’ అనే సినిమా నుంచి బయటకొచ్చేసినట్లేనని తెలుస్తోంది. ఒకపక్క తుప్పరివాలన్ టీమ్ కూడా ఇప్పటికే షూట్ మొదలుపెట్టేందుకు సిద్ధమైపోవడంతో రకుల్‌కు సినిమానుంచి బయటకు రావడం తప్ప వేరే ఆప్షన్ దొరకలేదట. ప్రస్తుతం రకుల్ తప్పుకోవడంతో ఆ పాత్రకు వేరొక హీరోయిన్ వెతికే పనిలో విశాల్ టీమ్ పడిపోయింది.