మహేష్ బాబుగారికి అస్సలు గర్వమే ఉండదు – రకుల్ ప్రీత్ సింగ్

23rd, May 2017 - 08:31:26 AM


తెలుగు పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో వరుస ఆఫర్లతో, విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ఆరంభం నుండే తనలోని ఉత్తరాది ఛాయల్ని దాచేసి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆమె ఈ వారం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరులో సమావేశంలో మాట్లాడిన ఆమె వేడుక చూడం విశేషాలతో పాటు ‘స్పైడర్’ చిత్ర విశేషాల్ని కూడా కొద్దిగా పంచుకున్నారు.

ఈ చిత్రంలో తాను డాక్టర్ పాత్ర పోషిస్తున్నానని, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరోతో కలిసి నటించడం నిజంగా తన అదృష్టమని అన్న ఆమె మహేష్ బాబుగారు ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా సాధారణంగా ఉంటారని, ఏదీ డిమాండ్ చేయరని, ఒక సీన్ చేశాక క్యారవాన్ లోకి వెళ్లకుండా స్పాట్లోనే ఉండి దర్శకుడితో కావాలంటే మరొక టేక్ చేద్దామంటారని మహేష్ మంచితనాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చెన్నలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.