టాప్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా రకుల్ ప్రీత్!

rakul
తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో రకుల్ ప్రీత్ సింగ్ ముందుండి దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్‌తో ఓ సినిమా, రామ్ చరణ్‌తో ధృవ అనే సినిమా చేస్తూ ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే రకుల్ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ఆమెను పలు టాప్ బ్రాండ్స్ అంబాసిడర్‌గా వ్యవహరించమని కోరడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇండియా లెవెల్లో పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న రకుల్, తాజాగా ఓ టాప్ మొబైల్ స్టోర్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ స్టోర్స్‌లో కొద్దికాలంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వస్తోన్న బిగ్ సీకి రకుల్ ప్రీత్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అంబాసిడర్‌గా నియమితురాలైన రకుల్ ఇవ్వాళే ఈ బ్రాండ్‌కు సైన్ చేశారు. గతంలో ఇలియానా, సమంత లాంటి టాప్ స్టార్స్ ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇక తనను బిగ్ సీ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికచేయడం చాలా సంతోషంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.