మరో క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్న రకుల్ ప్రీత్ !

16th, January 2018 - 08:37:53 AM


తెలుగు స్టార్ హీరోయినాల్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ‘అయ్యారే’ సీమలో నటించారామె. ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. కానీ విడుదలకు ముందే రకుల్ మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నారు. స్టార్ హీరో అజయ్ దేవగన్ చేయనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారామె.

కొన్నిరోజుల నుండి చర్చల్లో ఉన్న ఈ విషయాన్ని ఆమే స్వయంగా బయటపెట్టారు. లూవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఇందులో రకుల్ సిటీ అమ్మాయిగా కనబడనుంది. రకుల్ లోని ఎనర్జీని, సహజమైన నటనను చూసి ఆమెను ఎంచుకున్నామని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానుంది.