పరేషానులో పడిపోయిన రకుల్..!
Published on Nov 13, 2016 12:14 pm IST

rakul
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన స్టార్ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్‌తో ఒక సినిమా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ధృవ’, సాయిధరమ్ తేజ్‌తో ‘విన్నర్’.. ఇలా మూడు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయారు. ఈ మూడు సినిమాలను షిఫ్ట్‌లుగా మార్చుకుంటూ రకుల్ పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ‘ధృవ’ సినిమాకు సంబంధించిన పరేషానురా అనే పాట షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆడియోలో ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిన ఈ పాట షూట్‌తో ధృవ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుందట.

డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా కోసం టీమ్ ఇప్పట్నుంచే భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేసింది. షూట్ మొత్తం పూర్తవ్వగానే రామ్ చరణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొననున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook