అహ్మదాబాద్ నుంచి తిరిగొచ్చేసిన రకుల్!!
Published on Dec 1, 2016 9:18 am IST

rakul-preet-singh
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన స్టార్ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్‌తో ఒక సినిమా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ధృవ’, సాయిధరమ్ తేజ్‌తో ‘విన్నర్’, అక్కినేని నాగ చైతన్యతో ఒక సినిమా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా.. ఇలా ఇన్ని సినిమాలకు ఒకేసారి పనిచేస్తూ ఏమాత్రం ఖాళీ లేకుండా గడిపేస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే.

గతం ఐదు రోజులుగా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న రకుల్ ప్రీత్, మళ్ళీ వైజాగ్‌కి షిఫ్ట్ అయిపోయారు. వైజాగ్‌లో నాగ చైతన్య సినిమా షూట్‌లో రకుల్ ప్రీత్ కొద్దిరోజులు పాల్గొంటారు. ఆ తర్వాత మళ్ళీ అహ్మదాబాద్‌లో మహేష్ సినిమాలో తిరిగి జాయిన్ అవుతారు. ఇలా వరుసగా ఒక సినిమా తర్వాత మరో సినిమా షెడ్యూల్ పూర్తి చేస్తూ రకుల్ ప్రీత్ డేట్స్ సరిగ్గా మేనేజ్ చేస్తున్నారనే చెప్పాలి.

 
Like us on Facebook