
‘రఫ్’ సినిమాలో ‘రబ్బర్ బంతి..’ పాట చూసినవారు ఎవరైనా పైన చెప్పినట్టు అనుకోవాల్సిందే. ఆ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ ‘రఫ్’గా వేసిన మాస్ స్టెప్పులు, విల్లును వంచినట్టు వయ్యారంగా నడుమును తిప్పుతూ ఇచ్చిన హావభావాలు యువ ప్రేక్షకుల మతి పోగొట్టాయి. హట్రిక్ విజయాలతో మంచి హుషారుగా ఉన్న ఈ ఢిల్లీ అందగత్తె.. ‘రఫ్’లో గ్లామర్ డోస్ మరింత పెంచినట్టు ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆది హీరోగా నటించిన ‘రఫ్’ సినిమాకు సుబ్బారెడ్డి దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కోసం ఆది సిక్స్ ప్యాక్ చేశాడు. మణిశర్మ సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన లభిస్తుంది. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ సినిమాను నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘రఫ్’ ప్రోమో సాంగ్స్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.