రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్.?

ram-charan-rakul
టాలీవుడ్ లో గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకొని వరుస ఆఫర్స్ తో సతమతమవుతూ బిజీబిజీగా ఉన్న హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్. రోజు రోజుకీ రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లోని క్రేజీ ప్రాజెక్ట్స్ లో చాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ సరసన ‘పండగ చేస్కో’, రవితేజ సరసన ‘కిక్ 2’ సినిమాలతో పాటు ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమాకి కూడా సైన్ చేసింది. ఈ సినిమాతో పాటు తాజాగా ఓ రకుల్ ప్రీత్ ని ఓ బంపర్ ఆఫర్ వరించింది.

అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం రావడం. రామ్ చరణ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా కోసం ‘నా పేరే రాజు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి మళ్ళీ శ్రీను వైట్లతో చేస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని దానయ్య నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా లాంచనం కానుంది.

Exit mobile version