మహేష్ బాబుతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందట !

Rakul-Preet-and-mahesh-babu
మహేష్ బాబు, మురుగదాస్ ల సినిమా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కొత్త షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్ లో మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో ఈరోజు నుండి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ తో జతకట్టనుంది. ఇదే విషయాన్ని చెబుతూ మహేష్ బాబు, మురుగదాస్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ పర్సన్స్ తో పని చేయడం చాలా ఆనందంగా ఉందని రకుల్ ట్వీట్ చేశారు.

ఈరోజు జరగబోయే షూటింగ్ లో మహేష్, రకుల్ ప్రీత్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వారం రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్ తరువాత దర్శకుడు మురుగదాస్ కొన్నిరోజులు గ్యాప్ తీసుకుని తన బాలీవుడ్ చిత్రం ‘అఖీరా’ రిలీజ్ తరువాత తిరిగి కొత్త షెడ్యూల్ ను చెన్నైలో మొదలుపెడతారట. ఇకపోతే ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.