ప్రతి అబ్బాయి నాగ చైతన్యను చూసి నేర్చుకోవాలంటున్న రకుల్ ప్రీత్ !


స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నటించిన చిత్ర్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రంలో తనతో పాటు నటించిన హీరో నాగ చైతన్యపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది రకుల్. ప్రతి ఒక్క అబ్బాయి అతని నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని కూడా చెబుతోంది. సినిమా చిత్రీకరణ సమయంలో ఛైతన్య ప్రవర్తన, మాట తీరు చూసి రకుల్ ప్రీత్ తెగ ఇంప్రెస్స్ అయిపోయి అతనికి మంచి ఫ్రెండైపోయింది.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ‘చైతన్య చాలా నార్మల్ గా ఉంటాడు, మంచివాడు. ముఖ్యంగా సమంత గురించి, తమ ప్రేమ గురించి చేప్పేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాడు. ప్రతి ఒక్క అబ్బాయి అతని నుండి ఎంతో కొంత నేర్చుకోవాలి’ అన్నారు. ఇకపోతే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా నడుస్తూ 9 రోజుల్లో రూ. 35 కోట్ల వసూళ్లను రాబట్టింది.