తన రిలేషన్ షిప్ పై అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన రకుల్!

Published on Oct 10, 2021 5:06 pm IST

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున రకుల్ సోషల్ మీడియా వేదిక గా తన రిలేషన్ షిప్ పై అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అయిన వాసు భగ్నాని కుమారుడు అయిన హీరో జాకీ భగ్నాని తో తనకు లవ్ ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు.

థాంక్యూ ప్రియతమా, ఈ ఏడాది మీరు నాకు అతి పెద్ద బహుమతి, నా జీవితానికి రంగులు జొడించినందుకు థాంక్యూ, నన్ను ఆపకుండా నవ్వించినందుకు థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అతనితో ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కొండపొలం చిత్రం లో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ లో 5 మరియు తమిళం లో రెండు సినిమాలను చేయనుంది.

సంబంధిత సమాచారం :