“స్టారింగ్‌ యూ’తో యాప్ బిజినెస్ లోకి రకుల్ !

Published on Nov 23, 2021 12:23 am IST

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమన్ ప్రీత్ సింగ్ తో కలిసి చిత్ర పరిశ్రమలో ఔత్సాహిక ప్రతిభావంతుల కోసం ఒక యాప్‌ను ప్రారంభించారు. యాప్ పేరు Starring You. ఈ యాప్ కళాకారులకు కెమెరా ముందు వెనుక, అలాగే వారి కలల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ఒక మంచి వేదిక. సరిహద్దుల అడ్డంకిని అధిగమించడానికి ఇది ఔత్సాహికులకు ఎంతో మేలు చేయనుంది.

ఈ StarringYou లో ఎక్కడి నుండైనా ఆడిషన్ చేసుకునే అవకాశం ఉంది. ఔత్సాహిక నటులతో పాటు దర్శకులు, డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్‌లు మరియు సినిమాల్లో పని చేయాలనుకునే ఇతర నిపుణులు సైతం తమ కలలను సాకారం చేసుకోవడానికి ఈ యాప్ సహాయం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్ధమాన కళాకారులకు భారతీయ చలనచిత్ర రంగంలో రాణించే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోందట.

సహ-వ్యవస్థాపకురాలు రకుల్ మాట్లాడుతూ, “స్టారింగ్‌ యూతో మేము దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులందరికీ ఒకే గమ్యస్థానంగా ఉండే ఒక వ్యవస్థను నిర్మించాలని చూస్తున్నాము. ఈ యాప్ సినిమాకు సంబంధించి అన్ని విభాగాలను కలిగి ఉంటుంది. సంగీతం, కాస్టింగ్, మీడియా & ప్రొడక్షన్ హౌస్‌ లు కావచ్చు, ఇలా ఈ యాప్ అన్ని అంశాలలో పని చేస్తోంది. తమ పనిని ప్రదర్శించేందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న వారికీ ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిభ ఉన్న వారితో కలిసి ఇటువంటి సృజనాత్మక భాగస్వామ్యాలను నిర్మించడమే మా లక్ష్యం’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :