నేనింకా చాలా నేర్చుకోవాలి : రకుల్ ప్రీత్ సింగ్

Rakul-Preet
రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్. ఆ సినిమాలో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ‘లౌక్యం’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రకుల్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా రవితేజ ‘కిక్ 2’, రామ్ చరణ్ – శ్రీనువైట్లల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్, త్వరలోనే ఎన్టీఆర్ సినిమాలోనూ నటించేందుకు సిద్ధమైంది.

టాలీవుడ్‌లో ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోవడం పట్ల రకుల్ తన ఆనందాన్ని వెలిబుచ్చింది. ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడం తనకు సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా తెలిపింది. తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు కదా ? నెంబర్ వన్ హీరోయిన్‌గా మారే అవకాశం గురించి ఏమంటారు ? అన్న ప్రశ్నకు, “నేనిప్పుడే సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఏవో కొన్ని అవకాశాలు వచ్చినంత మాత్రాన నెంబర్ వన్ అయిపోము కదా? అయినా నేనింకా చిన్నపిల్లనే. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.” అంటూ తెలిపింది.

Exit mobile version