కరెంట్ తీగలో తన పాత్ర ప్రకటించిన రాకుల్

currentthiga1

మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్ నటించిన కరెంట్ తీగ సినిమా పోస్టర్ ని ఈరోజు విడుదలచేసారు. రాకుల్ ఈ పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. తన పాత్ర గురించి ఈ భామ మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో అమాయకపు పల్లెటూరి యువతి పాత్ర పోషించాడు. కొన్ని సన్నివేశాలలో స్కూల్ గర్ల్ పాత్ర పోషించాను” అని తెలిపింది

రాకుల్ కొన్ని సీన్ లను సన్నీ లియోన్ తో కలిసి నటించినట్లు తెలిపింది. ఈ సినిమా ఆడియో ఈ ఆదివారం విడుదలకానుంది. ఈ సినిమా షూటింగ్ లో మంచు మనోజ్ 10 సంవత్సరాల కెరీర్ ను పూర్తిచేసుకోవడం విశేషం. ప్రస్తుతం రాకుల్ కి వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. రవితేజ కిక్ 2 లో ఈ భామ హీరోయిన్ అని ప్రకటించడంతో ఈమె కెరీర్ గ్రాఫ్ పెరిగే అవకాశాలు వున్నాయి

Exit mobile version