జ్యోతిక 50వ సినిమా ట్రైలర్.. మామూలుగా లేదండోయ్..!

Published on Oct 5, 2021 1:28 am IST


కోలీవుడ్‌ ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో ఎరా. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రక్త సంబంధం’. ర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 14న అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధైర్యవంతురాలైన తంజావుర్‌ మహిళగా జ్యోతిక ఈ సినిమాలో కనిపించనుండగా, సముద్రఖని, శశికుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళ్‌లో ‘ఉడన్ పిరప్పు’ పేరుతో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :