సాలిడ్ యాక్షన్ తో రామ్ – బోయపాటి ప్రాజెక్ట్ స్టార్ట్.!

సాలిడ్ యాక్షన్ తో రామ్ – బోయపాటి ప్రాజెక్ట్ స్టార్ట్.!

Published on Nov 8, 2022 2:37 PM IST


మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించనున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ చిత్రం కోసం తెలిసిందే. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను కాంబోలో అనౌన్స్ చేసిన ఈ చిత్రం వీరి మార్క్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా అయితే అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. మేకర్స్ ఈ చిత్రాన్ని లేటెస్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీ లో అయితే ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఇందులో బోయపాటి తన మార్క్ లో స్టంట్ మాస్టర్ శివ తో సీక్వెన్స్ ని డిజైన్ చేయించుకోగా ఇందులో రామ్ కూడా తన కంప్లీట్ ఎఫర్ట్స్ తో సన్నద్ధం అయ్యాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో అయితే శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు