గ్రాండ్ గా లాంచ్ అయిన రామ్ – బోయపాటిల మాసివ్ ప్రాజెక్ట్.!

Published on Jun 1, 2022 1:10 pm IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇపుడు తన మాస్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నాడని చెప్పాలి. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేసిన సినిమా “ఇస్మార్ట్ శంకర్” తో భారీ హిట్ అందుకున్నాక మాస్ ఫార్ములా లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

లేటెస్ట్ గా అయితే తమిళ దర్శకుడు ఎన్ లింగుసామి తో చేసిన “ది వారియర్” చిత్రం కంప్లీట్ అయ్యి మంచి అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉండగా దీని తర్వాత మరో సిసలైన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమాని తన లైనప్ లో పెట్టుకోగా ఇపుడు ఈ మాసివ్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

తన కెరీర్ లో 20వ సినిమాగా హైదరాబాద్ లో లాంచ్ అయ్యింది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొనగా బురుగుపల్లి శివ రామ కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు.

మరి దర్శకులు ఎన్ లింగుసామి మరియు వెంకట్ ప్రభులు స్క్రిప్ట్ ని తమ చేతులతో అందించగా బోయపాటి ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేసారు. మరి ఈ సినిమాని అయితే ఏకంగా 5 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే తన మార్క్ లోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :