
రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్నాడు హీరో రామ్. ఈ క్రమంలోనే ‘పండగ చేస్కో’, ‘శివం’, ‘హరికథ’ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయారు. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. ఒక్క పాట మినహా దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు సమాచారం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు.
తాజాగా మిగిలిన ఆ ఒక్క పాట షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ పాట బీచ్‌లో నడిచే పాటగా చెప్పబడుతుంది. రామ్ ప్రస్తుతం ఈ పాట షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ సైట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పాటలో రామ్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడన్నది ఈ ఫోటో చూస్తే స్పష్టంగా కనబడుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఈ నెలాఖర్లో విడుదల చేయనున్నారు. మే 14న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.