మేము బాగా ఎంజాయ్ చేశాం…”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం” పై రామ్ చరణ్ వ్యాఖ్యలు!

Published on Oct 19, 2021 1:30 pm IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

ఈ చిత్రంపై తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఖిల్ అక్కినేని నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రదర్ అంటూ సంబోధిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ పై సంతోషం వ్యక్తం చేశారు. పూజ హెగ్డే నటన అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. గీతా ఆర్ట్స్ కి మరియు బొమ్మరిల్లు భాస్కర్ కి కంగ్రాట్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని మేము బాగా ఎంజాయ్ చేశాం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More