నష్టాల్లో రామ్‌ చరణ్‌ బిజినెస్‌.. కారణం అదేనా?

Published on Feb 19, 2022 12:00 am IST

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, బిజినెస్‌మెన్‌గా కూడా రాణిస్తున్నాడు. 2015లో చరణ్‌ తన స్నేహితుడితో కలిసి ట్రూజెట్‌ పేరుతో డొమాస్టిక్‌ ఎయిర్‌లైన్‌ బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ సంస్థ నష్టాల్లో నడుస్తుందని, దీంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందిస్తూ ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.

అయితే అడ్మినిస్ట్రేటివ్ గాను, సాంకేతిక కారణాల వల్ల తమ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకం ఏర్పడిందని త్వరలో పునఃప్రారంభిస్తామని ట్రూజెట్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని వినబడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, పాక్షిక జీతాలు ఇస్తున్నామని, తక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చామని తెలిపారు.

సంబంధిత సమాచారం :