చరణ్ ఎంట్రీ సీన్ పై క్రేజీ అప్ డేట్ !

Published on Jul 3, 2022 11:16 pm IST


క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకి సంబంధించి రోజుకొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా క్లైమాక్స్ కోసం 30 కోట్లు ఖర్చు పెట్టారని.. ఈ సినిమా ఇంటర్వెల్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారని.. ఇలా చాలా రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే.. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ పై కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సీన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ కూడా వేశారట.

పైగా ఈ సీన్ ను రూ.10 కోట్లు ఖ‌ర్చుపెట్టి తీస్తున్నారట. మొత్తానికి శంకర్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :