చరణ్-శంకర్ మూవీ పాట కోసం 80 మంది విదేశీ డ్యాన్సర్లు..!

Published on Nov 26, 2021 1:40 am IST


మెగా హీరో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. #ఋఛ్15 పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ బిగ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో చరణ్, కియారాలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటకు శంకర్ కాస్త డిఫరెంట్‌గా డ్యాన్స్‌ను డిజైన్ చేయించినట్టు టాక్ వినిపిస్తుంది.

వివిధ దేశాలకి చెందిన 80 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారని, ఆల్రెడీ అమెరికా, రష్యా, బ్రెజిల్, ఉక్రెయిన్, యూరప్ నుంచి డాన్సర్స్ వచ్చేశారట. ఈ బృందంపై 10 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుందట. జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ పాట సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :