సోషల్ మీడియాని తమ కంట్రోల్ లో పెట్టేసుకున్న చరణ్, విజయ్ లు.!

Published on Jul 3, 2022 8:01 am IST

మన టాలీవుడ్ స్టార్స్ ని తమ అభిమాన హీరోలు ఎప్పటికప్పుడు మంచి కొత్త లుక్స్ లో చూడాలి అనుకుంటారు. అలా తమ అభిమానులను అలరించేందుకు మన స్టార్స్ ఎంతవరకు అయినా సిద్ధ పడతారు. మరి అలా లేటెస్ట్ గా అయితే మాత్రం మన టాలీవుడ్ నుంచి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ కిక్ ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

మొదటగా విజయ్ దేవరకొండ చేస్తున్న “లైగర్” నుంచి వచ్చిన షాకింగ్ లుక్ చూసి ముందు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేయగా సోషల్ మీడియాలో అయితే అది రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక రామ్ చరణ్ నుంచి అయితే శంకర్ తో ప్రాజెక్ట్ కి గాను తన హెయిర్ స్టైలిస్ట్ సిద్ధం చేసిన సరికొత్త లుక్ ని జస్ట్ చిన్న గ్లింప్స్ లా సగం మాత్రమే రివీల్ చేయగా సడెన్ గా బయటకి వచ్చిన ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిపోయింది. దీనితో అయితే నిన్న సోషల్ మీడియాని మాత్రం రామ్ చరణ్ మరియు విజయ్ దేవరకొండ లు తమ కంట్రోల్ లో పెట్టేసుకున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :