ఖైదీ చిత్రాన్ని జనవరి 11న ఎందుకు రిలీజ్ చేస్తున్నారో చెప్పిన రామ్ చరణ్ !

3rd, January 2017 - 04:38:08 PM

ram-charan
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ అని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి రిలీజుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు సినిమా జనవరి 12 వస్తుందా లేకపోతే 11న వస్తుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. వాళ్ళు సందేహాలన్నీ తీర్చేలా కొద్దిసేపటి క్రితమే చరణ్ పేస్ బుక్ ద్వారా సినిమా జనవరి 11న రిలీజ్ కానుందని తెలిపారు. అలాగే ముందుగా రిలీజ్ జనవరి 12న అనుకుని ఇప్పుడు 11కు మార్చడం వెనుకున్న కారణం ఏమిటో కూడా చెప్పారు.

అదేమిటంటే జనవరి 12న మరో పెద్ద సినిమా బాలయ్యగారి 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా రిలీజ్ కానుందని, అలా ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవడం పరిశ్రమకు మంచి పరిణామం కాదని అందుకే ముందు 12న అనుకున్నా కూడా నాన్నగారి సలహా మేరకు 11కి మార్చామని అన్నారు. అలాగే 12న రాబోతున్న బాలయ్య సినిమాకు ఆల్ ది బెస్ట్ కూడా కూడా చెప్పారు. యెక్ప్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 7న హాయ్ ల్యాండ్ లో భారీ ఎత్తున నిర్వహించనున్నామని, కనుక అందరూ వచ్చి చిరంజీవిగారి రీ ఎంట్రీకి స్వాగతం చెప్పాలని రామ్ చరణ్ కోరాడు.