త్వరలో… రామ్ చరణ్ ఇన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

Ram-Charan-mek
బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ.. వీక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. మొదటి సీజన్ అందించిన ఉత్సాహంతో కింగ్ నాగార్జున రెండవ సీజన్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాదించడంలో తారల తళుకు బెళుకులు కూడా ఓ కారణమే. ఇది గమనించిన నిర్వాహకులు రెండో సీజన్లో నటీనటులకు పెద్ద పీట వేశారు. ఇప్పటికే అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ తేజ్, పూజా హెడ్గే తదితరులు పాల్గొన్నారు. ఇక, రామ్ చరణ్ వంతు వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటివలే ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించినట్టు తన అఫీషియల్ పేస్ బుక్ లో రామ్ చరణ్ వెల్లడించారు. దాంతో, అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version