“నాట్యం” ప్రీ రిలీజ్ వేడుక కి ముఖ్య అతిథిగా రామ్ చరణ్!

Published on Oct 14, 2021 2:00 pm IST

సంధ్య రాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు నిష్రింకల ఫిల్మ్స్ పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు సంధ్య రాజు లు నిర్మిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరగనుంది.

సంబంధిత సమాచారం :