రాజమండ్రిలో రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ‘రంగస్థలం 1985’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్ చరణ్ కూడా ఈరోజు నుండి షూట్లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్లో చరణ్, సమంతలపై ఒక పాటల్ని చిత్రీకరించనున్నారు. ఇదివరకే కొన్నిరోజులుపాటు రాజమండ్రి, ఇతర గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు చిత్ర యూనిట్.

ఈ షెడ్యూల్ పూర్తికాగానే హైదరాబాద్లో వేయబోయే భారీ సెట్లో ప్రత్యేక గీతాన్ని రూపొందించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. అలాగే టీజర్ ను ఈ నెల 24వ తేదీన సాయంత్రం విడుదలచేయనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.