తేజ్ లుక్ వెనక రామ్ చరణ్

RamCharan SaiDhram

వరుస పరాజయాల తర్వాత తనని తాను మలుచుకుని హిట్ ట్రాక్ ఎక్కే ప్రయత్నంలో ఉన్నాడు మెగా హీరో సాయి తేజ్. ఇప్పటికే ‘చిత్రలహరి’తో మంచి రీస్టార్ట్ అందుకున్న ఆయన ఈ నెల 20న విడుదలకానున్న ‘ప్రతిరోజూ పండగే’తో ఇంకో మెట్టు పైకెక్కే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమాలో తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలనుకున్న తేజ్ బాగా బరువు తగ్గి సిక్స్ ప్యాక్ బాడీతో అలరిస్తున్నాడు.

ఒక్కసారిగా ఇంత ఛేంజ్ ఎలా సాధ్యం అంటే దానికి రామ్ చరణ్ కూడా ఒక కారణం అంటున్నాడు తేజ్. చరణ్ తన కోసం తన వ్యక్తిగత ట్రైనర్ రాకేశ్ ఉడియార్ ను సజెస్ట్ చేశాడని, కొంత బరువు తగ్గాక నన్ను చూసి ఇది చాలదురా.. ఇంకా చేయాలి అన్నాడని, అలా తన స్లిమ్ లుక్ వెనక చరణ్ ప్రేరణ ఉందని చెప్పుకొచ్చాడు. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్లతో చాలా పాజిటివ్ బజ్ తెచ్చుకోగా టీమ్ మొత్తం చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

Exit mobile version