రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్…మామూలుగా లేదుగా!

Published on Mar 27, 2022 2:35 pm IST


టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం తో ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ రోజుతో మరో ఏడాది వయసు పూర్తి చేసుకున్న రామ్ చరణ్, ఆర్‌ఆర్‌ఆర్‌లో తనతో కలిసి నటించిన మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.

రామ్ చరణ్ భార్య సోషల్ మీడియా ద్వారా బర్త్ డే పార్టీ కి సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఉపాసన, తారక్, ప్రణతి, ఎస్ఎస్ కార్తికేయ మరియు పూజా ప్రసాద్ లు ఉన్నారు. షేర్ చేసిన కొద్ది సేపటికే ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరో పుట్టిన రోజు కి యంగ్ టైగర్ కూడా ఉండటం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో సైతం అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు, హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్‌తో తన రాబోయే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :