“ఆచార్య” హిందీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన చరణ్.!

Published on Apr 24, 2022 8:01 pm IST

ప్రస్తుతం విడుదలకి సిద్ధంగా ఉన్న మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా నిన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకతో మరింత హైప్ ను కూడా తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో దాదాపు మన తెలుగు నుంచి అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రిలీజ్ ముఖ్యంగా హిందీలో రిలీజ్ అవుతున్నాయి.

అలాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని గట్టిగానే టాక్ నడిచింది. కానీ ఫైనల్ గా కేవలం తెలుగు రిలీజ్ కి మాత్రమే వచ్చింది. మరి హిందీ రిలీజ్ పై లేటెస్ట్ గా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ముందు అనుకున్నదే కానీ తర్వాత RRR సినిమాకి దీనికి పెద్దగా గ్యాప్ లేకుండా పోయింది అని..

అందుకే ఈ సినిమాకి చెయ్యాల్సిన పనులు చాలా ఉండడం నేను కూడా శంకర్ గారి సినిమాలో బిజీగా షెడ్యూల్స్ లో వల్ల చెయ్యడానికి వీలు పడలేదని అలాగే వేరే భాషలో చేసినా నేను నా సొంత వాయిస్ తోనే రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను సో మరికొన్ని నెలల్లో ఈ సినిమా హిందీ రిలీజ్ కూడా ఉంటుంది అని చరణ్ క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :