ఆ రెండు సినిమాల్లోనూ నటించట్లేదన్న రామ్ చరణ్

Ram charan1

‘సైరా’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమాల్ని చకచకా పట్టాలెక్కిస్తున్నారు. తన 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆయన 153వ చిత్రంగా మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయనున్నారట. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ చరణ్ కీలక పాత్రలు చేస్తారనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.

ఇటీవలే మీడియాతో మాట్లాడిన చిరు ఈ వార్తలపై స్పందించారు. ఈ రెండు సినిమాల్లోనూ తాను నటించడంలేదని, అసలు ఆ చిత్రాల్లో తనకు సరిపోయే పాత్రలున్నాయో లేదో కూడా తెలీదని చెర్రీ చెప్పుకొచ్చారు. ఈ వార్త చిరు, చరణ్ మల్టీస్టారర్ చేయనున్నారని సంబరపడిన అభిమానులకు కొంచెం నిరుత్సాహం కలిగించేదే అయినా అనవసరమైన పుకార్లకు మాత్రం పూర్తిగా చెక్ పెట్టింది.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని, ఆలస్యమవుతుందనే వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version