ప్రతీ వారం మనది కాదు.. చరణ్ కామెంట్స్ వైరల్

ప్రతీ వారం మనది కాదు.. చరణ్ కామెంట్స్ వైరల్

Published on Jan 18, 2025 7:17 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా కుట్ర పూరితంగా చంపబడింది అని అభిమానులు, మేకర్స్ చెబుతున్నారు. మరి చివరికి ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా ఒక డిజప్పాయింటింగ్ ఎండింగ్ తోనే నిలిచింది. అయితే లేటెస్ట్ గా రామ్ చరణ్ కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి.

చరణ్ ఆఫ్ లైన్ లో ఎంత పరిపక్వతతో నడుచుకుంటాడో తెలిసిందే. హీరో గానే కాకుండా తన మాట, నడవడికతో కూడా చాలా మంది అభిమానులను తను సంపాదించుకున్నాడు. మరి ఇలా బాలయ్య టాక్ షోలో తను చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. నేనెప్పుడూ సంయవణం పాటించాలని కోరుకుంటానని.

ఏదైనా చర్య జరిగితే జరిగితే దానికి వెంటనే ప్రతి చర్య జరగాలని కోరుకోను, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని నమ్ముతాను అని తెలిపాడు. అలాగే ప్రతీ ఏడాది మనది కాదు అలానే ప్రతీ వారం, ప్రతీ రోజు మనవి కాదు. కొన్ని సార్లు మనకి అద్భుతంగా ఉండొచ్చు కానీ కొన్ని సార్లు మనకి అనుకూలంగా ఉండదు అనేది ఒప్పుకొని తీరాలి అంటూ తెలిపాడు. దీనితో ప్రస్తుత పరిస్థితికి ఇవి యాదృచ్చికంగా కలిసి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు