జ్వరంతో బాధపడుతున్న రామ్ చరణ్

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ఈ షూట్ నుంచి రామ్ చరణ్ స్వల్ప విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హై ఫీవర్ తో బాధపడుతున్నాడు.

‘ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నాను. గోవిందుడు అందరివాడేలే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినందుకు బాధగా ఉంది. త్వరలో మళ్ళీ స్పీడ్ గా షూటింగ్ చేస్తామని’ రామ్ చరణ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజ్ కిరణ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version