‘ధృవ’ కోసం నిర్విరామంగా కష్టపడుతోన్న చరణ్!

12th, October 2016 - 07:43:10 PM

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ కోసం సినీ అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పక్కర్లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ నిన్న సాయంత్రం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్ ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడిపోయింది. ఇప్పటికే టాకీ పార్ట్ దాదాపుగా పూర్తికాగా మిగిలి ఉన్న రెండు పాటలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.

దసరా రోజున కూడా ఓ పాట షూటింగ్ జరిపి టీమ్ నిర్విరామంగా కష్టపడుతోంది. మరో రెండు రోజుల్లో రెండో పాట షూటింగ్ జరగనుంది. దాంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందట. డిసెంబర్‌లో విడుదల కానున్న సినిమా కోసం భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా చేపట్టాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు.