వైరల్ : “RC15” కోసం గట్టిగా రెడీ అవుతున్న మిస్టర్ బాక్సాఫీస్.!

వైరల్ : “RC15” కోసం గట్టిగా రెడీ అవుతున్న మిస్టర్ బాక్సాఫీస్.!

Published on Nov 17, 2022 12:30 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ మంచి డేడికేటివ్ స్టార్ హీరోస్ మిస్టర్ బాక్సాఫీస్ అండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి చరణ్ ని అయితే తన సినిమాల వసూళ్లతోనే కాకుండా తన బాడీ ని కూడా మిస్టర్ బాక్సాఫీస్ అని అభిమానులు పిలుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఒకో సినిమాకి కూడా తన దేహాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తూ వస్తున్న చరణ్ రీసెంట్ గా RRR సినిమాలో చాలా వేరియేషన్స్ చూపించి ఫ్యాన్స్ లో క్రేజీ టాపిక్ గా మారాడు.

ఇక ఇప్పుడు రాజమౌళి తర్వాత మావెరిక్ దర్శకుడు శంకర్ చేతిలో పడిన చరణ్ మళ్ళీ తనని మిస్టర్ బాక్సాఫీస్ ఎందుకు అంటారో చూపిస్తున్నాడు. లేటెస్ట్ గా మేకర్స్ ప్లాన్ చేసిన ఓ కొత్త షెడ్యూల్ కోసం గాను చరణ్ గట్టి వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఎక్కడో లొకేషన్ లో ఏర్పాటు చేసిన మినీ జిమ్ లో తన కో ఆర్టిస్ట్ తో అన్నట్టు గట్టిగా జిమ్ చేస్తూ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపాడు. దీనితో ఈ క్రేజీ వీడియో మంచి వైరల్ గా మారుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు