గౌతమ్ తిన్ననూరి తో తన నెక్స్ట్ మూవీ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 27, 2022 5:00 pm IST

శంకర్ దర్శకత్వంలో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడు.

అయితే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు, ఆచార్య ప్రమోషన్స్ సందర్భంగా, రామ్ చరణ్ ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా కాదని, సెన్సిబుల్ ఎమోషన్స్‌ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా ఉంటుందని చెప్పారు. మరి చరణ్ కోసం గౌతమ్ ఎలాంటి సినిమా డిజైన్ చేశాడో చూడాలి. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరో గా దూసుకు పోతున్నాడు.

సంబంధిత సమాచారం :