చరణ్ ప్రయోగం ఫలించేలానే ఉంది

ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ పాత్రలే చేస్తూ వచ్చిన స్టార్ హీరో రామ్ చరణ్ తొలిసారి ‘రంగస్థలం’ చిత్రం ద్వారా ప్రయోగానికి పూనుకున్నారు. దీంతో అభిమానులంతా సినిమా ఎలా ఉంటుందో, చరణ్ ఎలా కనిపిస్తాడా తెలుసుకోవాలని ఉవ్విళ్లూరిపోయారు. వాళ్ళ ఎదురుచూపులకి సమాధానం అనేలా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

టీజర్లో చరణ్ ఎక్కడా క్లాస్ టచ్ అనేదే లేకుండా పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఆయన పాత్రకు పూర్తిస్థాయి వికిడిలోపం కూడా ఉంది. ఆ అంశమే సినిమాలో కీలకంగా ఉండి మంచి వినోదాన్ని, ఆసక్తికరమైన కథనాన్ని అందించి కొత్త రామ్ చరణ్ ను మన ముందు నిలుపుతుందనిపిస్తోంది. అంతేగాక మెగా అభిమానాలు కోరుకునే మాస్ కంటెంట్ కూడా మంచి మోతాదులోనే ఉండేలా ఉంది. మొత్తంగా టీజర్లోని అంశాలన్నిటినీ కలిపి చూస్తే చరణ్ చేసిన ఈ ప్రయోగం సుకుమార్ నరేషన్ తో సత్పలితాన్నే ఇస్తుందనే నమ్మకం కలుగుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందివ్వగా రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి :