కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్?

Published on Sep 6, 2023 8:06 am IST


ఆర్ ఆర్ ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తదుపరి ఈ గ్లోబల్ స్టార్, కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్ చేంజర్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్, ప్రముఖ స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించనున్నారు అని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ కి చెందిన బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. రామ్ చరణ్ కి గ్లోబల్ గా ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ బయోపిక్ న్యూస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :