ఇంట్రెస్టింగ్..ఈ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో చరణ్ క్యామియో.!

Published on Mar 7, 2023 1:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ ప్రస్తుతానికి బ్రేక్ లో ఉండగా చరణ్ అండ్ తన భారీ సినిమా RRR ఆస్కార్స్ ఈవెంట్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు చరణ్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో తెలుస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనెర్ చిత్రం “కిసీ కా భాయ్ కిసీ కా జాన్” చిత్రంలో కనిపించనున్నాడట. అయితే ఇది స్టోరీ లో కాకుండా సాంగ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

మరి ఈ సినిమాలో వెంకీ మామ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో సినిమాలో అయితే కనిపించనున్నారట. మరి సల్మాన్ కి మరియు చరణ్ కి ఎప్పటి నుంచో మంచి బాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ కూడా చరణ్ ని ఆరాధించే జానీ మాస్టర్ కావడంతో ఈ సాలిడ్ కాంబో సెట్టయ్యింది. మరి సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :