తన బెస్ట్ ఫ్రెండ్ తారక్ వేరియేషన్స్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Apr 21, 2022 11:10 am IST


రీసెంట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ మరియు మాస్ హీరోస్ వీటికి మించి మంచి స్నేహితులు అయినటువంటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” తో సాలిడ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ దీక్షలో ఉండడమే కాకుండా తమ నెక్స్ట్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు.

అయితే చరణ్ కీలక పాత్రలో నటించినటువంటి మెగా మాస్ మల్టీ స్టారర్ “ఆచార్య” కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ లో తన బెస్ట్ ఫ్రెండ్ తారక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది. దర్శకుడు కొరటాల శివ హీరోలని ఎంత సెన్సిబుల్ గా చూపిస్తారో అనే దానిపై మాట్లాడుతూ..

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పై “టెంపర్” లో తారక్ ని అలాగే “జనతా గ్యారేజ్” లో తారక్ కి చాలా తేడా ఉంటుంది అని నాకు జనతా లో తారక్ అయితే బాగా నచ్చాడు అని చరణ్ ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్స్ పై తన స్పందనను తెలియజేసాడు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు ఇరు హీరోల అభిమానుల్లో మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :