సమంత గురుంచి రామ్‌ చరణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Published on Dec 27, 2021 11:04 pm IST


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక ఆమె కెరిర్ డౌన్ ఫాల్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ని కూడా చేసి మెప్పించింది సామ్‌.

ఇదిలా ఉంటే తాజాగా సమంతపై ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చెర్రీకి సమంత గురుంచి చెప్పమన్న ప్రశ్న రాగా దానికి చెర్రీ ‘కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌..’ అని మూడు ముక్కల్లో సమాధానం చెప్పేశాడు. అయితే తన గురుంచి చెర్రీ చెప్పిన మాటల వీడియోకు మూడు లవ్ సింబల్స్‌ని జోడించి సమంత తన ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది.

సంబంధిత సమాచారం :