శ్యామ్ సింగరాయ్’పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Published on Jan 8, 2022 9:34 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “శ్యామ్ సింగరాయ్”. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లనే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను కూడా అందుకుంటుంది.

అయితే ఈ సినిమాపై తాజాగా మెగాస్టార్ రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన పరిశ్రమ నుండి వచ్చిన మరో అద్భుతమైన చిత్రం “శ్యామ్ సింగరాయ్” అని, ఈ సినిమా ద్వారా ఒక అందమైన అనుభవాన్ని రాహుల్ సాంకృత్యాన్ చూపించాడని, నాని, సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచారని అన్నారు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లకు కంగ్రాట్స్ తెలుపుతూ, చిత్ర బృందం మొత్తానికి చరణ్ అభినందనలు తెలియచేశాడు. ఇదిలా ఉంటే జనవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :