చిరు సినీ ప్రస్థానంపై చరణ్ అద్భుత పోస్ట్ వైరల్.!

Published on Sep 23, 2021 11:00 am IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నిన్నటితో తన సినిమా ప్రస్థానంకి 43 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై చిరు కూడా తన ప్రయాణంపై ఓ ఎమోషనల్ పోస్ట్ తో పంచుకున్నారు. అంతే కాకుండా తన మొదటి సినిమా పునాది రాళ్లు నాటి టైం ఫోటోని కూడా తన సోషల్ మీడియా డీపీ గా పెట్టుకున్నారు. మరి ఈ మెగా లెగసీ ని తన భుజాలపై ఎక్కడా తక్కువ చెయ్యకుండా మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకెళ్తున్నాడు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు చిరు సినీ ప్రస్థానంపై చరణ్ పెట్టిన ఓ అద్భుత పోస్ట్ వైరల్ అవుతుంది. తన తండ్రి మొదటి సినిమా నాటి ఫోటో ఇప్పుడు కంప్లీట్ చేసిన ఆచార్య సినిమా ఫోటో పెట్టి అప్పుడు నుంచి ఇప్పుడు వరకు మీ ప్రయాణం ఇలా కొనసాగుతుంది అన్నట్టుగా తెలిపాడు. ’43 సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది మా నాన్న’ అంటూ చిరు ని టాగ్ చేసి చరణ్ తెలిపాడు. దీనితో ఈ ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :