వన్ అండ్ ఓన్లీ రాజమౌళి.. రామ్ చరణ్ పోస్ట్ వైరల్.!

Published on Oct 2, 2022 2:00 pm IST

లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తెలుగు వెర్షన్ ని ఈ చిత్రం దిగ్గజ దర్శకుడు రాజమౌళి సమక్షంలో లాస్ ఏంజెల్స్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్పెషల్ స్క్రీనింగ్ ని ఎంజాయ్ చేశారు. దాదాపు 900 మందికి పైగా ఎంతో మంది విదేశీ స్వదేశీ ఆడియెన్స్ తో కలిపి ప్లాన్ చేసిన ఈ గ్రాండ్ షో లో రాజమౌళి పై వచ్చిన ప్రశంసలు కూడా అన్నీ ఇన్నీ కావు.

దీనితో రాజమౌళి పై ఎన్నో విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతుండగా వాటిలో ఓ వీడియోని అయితే రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ గా పెట్టి తన దర్శకుడు రాజమౌళి పట్ల గర్వం వ్యక్తం చేస్తున్నాడు. మా వన్ “అండ్ ఓన్లీ రాజమౌళి” అంటూ పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. మొత్తానికి అయితే మరోసారి జక్కన్న పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మారుమోగుతూ తెలుగు సహా ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది.

సంబంధిత సమాచారం :