శంకర్ నెక్స్ట్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 25, 2022 11:00 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు మరియు ఈ విషయాన్ని స్వయంగా ప్రేక్షకులకు రామ్ చరణ్ వెల్లడించాడు. రామ్ చరణ్ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని శంకర్ సినిమా గురించి మాట్లాడారు.

ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు చరణ్. షార్ట్ టెంపర్ కారణంగా బలవంతంగా ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించే ఐపీఎస్ అధికారిగా చరణ్ నటిస్తున్నాడు. షార్ట్ టెంపర్ యాంగిల్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చరణ్ ఈ సందర్భంగా చెప్పారు. శంకర్ తన హీరోలను ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ప్రదర్శిస్తాడు మరియు ఈ కోణం చాలా బాగుంది అని చెప్పాలి. ఈ చిత్రం లో కియార అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :